బీపీ - చక్కెర వ్యాధితో బాధపడుతున్నా.. ఓట్లేసి గెలిపించండి : మంత్రి విజయభాస్కర్

శుక్రవారం, 26 మార్చి 2021 (11:46 IST)
తాను బీపీ, చక్కెర వ్యాధితో బాధపడుతున్నాను., ఎండల్లో తిరుగుతా ప్రచారం చేయలేను. అందువల్ల తన నియోజకవర్గ ప్రజలు తనకు ఓట్లు వేసి గెలిపించాలని తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖామంత్రి విజయభాస్కర్  విజ్ఞప్తి చేశారు.
 
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా, ఆయన ఈ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తాను బీపీ, షుగర్‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని, కాబట్టి తనను ఆదరించాలని కోరారు. 
 
కాగా, ఆయ‌న పుదుకోట్టై జిల్లా విరాళిమలై నుంచి రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య శాఖ‌ మంత్రిగా చాలా కాలంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు కురిపిస్తుండ‌డంతో ఆయ‌న స్పందించారు.
 
తాను సెంటిమెంట్ అస్త్రాన్ని ప్ర‌యోగించి ఓట్ల కోసం పాకులాడడం లేదని చెప్పుకొచ్చారు. త‌న‌ జీవితంలో ఎదుర్కొంటోన్న‌ సమస్యలను గుర్తుచేయడంలో తప్పులేదని అన్నారు. అస‌లు తాను నియోజకవర్గంలో ఓట్లు అడగాల్సిన అవసరం కూడా లేదని, తనకు ఓట్లు వేయడానికి అత్య‌ధిక శాతం మంది ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.
 
తాను ఇటీవ‌ల ఓ ప్రాంతంలో చేసిన ప్రసంగాన్ని కొంద‌రు వక్రీకరిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. తాను విశ్రాంతి లేకుండా సేవల్ని అందించానని చెప్పారు. ఈ విష‌యాల‌ను వివ‌రిస్తూ చెబుతూ త‌న‌కున్న‌ బీపీ, షుగర్‌ గురించి మాట్లాడాన‌ని అన్నారు. అందులో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు