ఎన్నికల సిత్రాలు!! అభ్యర్థుల పాట్లు చూడతరమా?

బుధవారం, 24 మార్చి 2021 (07:31 IST)
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. సినీ నటుడు కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్ నీది మయ్యంతో కూడిన కూటమి, మరికొన్ని చిన్నాచితక పార్టీలు తలపడుతున్నాయి. 
 
అయితే, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం విజయం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఐదేళ్ళపాటు ఎక్కడున్నారో కూడా తెలియని నేతలు.. ఇపుడు వీధి వీధి తిరుగుతా.. సిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. 
 
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లు చూస్తే ప్రతి ఒక్కరు నవ్వురాకుండా ఉండదు. తాజాగా అన్నాడీఎంకే అభ్యర్థి తంగ కదిరవన్ ఓటర్ల దృష్టి ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. 
 
క్షేత్రస్థాయికి వెళ్లిన ఆయన ఓ చోట నేలపై కూర్చొని బట్టలు ఉతికారు. తాను గెలిస్తే వాషింగ్‌ మెషీన్లు కొనిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నాగపట్టణం అసెంబ్లీ స్థానం నుంచి కదిరవన్ పోటీ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు