కాఫీ ఆర్డర్ చేసాడు, తీసుకొచ్చి పెట్టగానే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు

శనివారం, 23 డిశెంబరు 2023 (12:24 IST)
గుండెపోటు. ఇటీవలి కాలంలో ఎందరో ప్రాణాలను కబళిస్తున్న గుండె పోటు వ్యాధి. ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి హోటలకి వచ్చాడు. అక్కడ కాఫీ ఆర్డర్ చేసి కూర్చున్నాడు.
 
ఇంతలో ఎవరో వ్యక్తితో ఫోనులో మాట్లాడాడు. అలా మాట్లాడుతూ వుండగానే ఆర్డర్ చేసిన కాఫీ వచ్చింది. కాఫీ తాగుదామని సిద్ధమవుతుండగానే ఏదో అస్వస్థత ఆవహించినట్లుండి అటుఇటూ కొద్దిసేపు కదిలాడు. ఆ తర్వాత ఎదురుగా వున్న టేబులపై తల వాల్చేసి ప్రాణాలు వదిలాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

కాలం ఎప్పుడు ఎలా మారుతుందో నమ్మకం లేదు, హోటల్‌లో ఆర్డర్ చేసాడు మరియు తినలేకపోయాడు. భూమ్మీద నూకలు చెల్లి పోయాయ్ అంటే ఇదేనేమో!మనిషి ప్రాణం గడియారం లాంటిది బ్రతికినంత కాలం కుట్రలు కుతంత్రాలు లేకుండా బ్రతకడం చాలా మంచిది అందరితో నవ్వుతూ మీరు నవ్వుతూ కుటుంబాన్ని నవ్విస్తూ బతకాలి పాపం… pic.twitter.com/nm7NT7BYBq

— Ravi Vallabhaneni (ఆహ్వానిద్దాం యువ గళం) (@ravivallabha) December 22, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు