ఆహారంలో మామిడి పొడిని వాడండి.. చికెన్, ఫిష్, గుడ్లు, పనీర్, సోయా??
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా బారిన పడిన పేషెంట్లు మందుల కంటే కూడా ఎక్కువగా పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని ఎన్నో రోజులుగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన రోగనిరోధక శక్తి ఈ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందని, అందువల్ల సరైన ఆహారం చాలా ముఖ్యమని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.
తాజాగా భారత ప్రభుత్వం కూడా కొవిడ్ పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారంపై పలు సూచనలు చేసింది. ఈ మేరకు MyGovIndia ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో ఏముందంటే.. తగిన స్థాయిలో విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందడానికి ఐదు రకాలు పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
రాగి, ఓట్స్‌లాంటి తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా అందించే చికెన్, ఫిష్, గుడ్లు, పనీర్, సోయా, కాయగింజలు, బాదాం, వాల్‌నట్స్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవాలని పేర్కొన్నారు.