గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి.. స్లో పాయిజన్ ఇచ్చారా?

సెల్వి

శుక్రవారం, 29 మార్చి 2024 (11:42 IST)
Mukthar ansari
ప్రముఖ గ్యాంగ్ స్టర్, ఆతరువాత రాజకీయ నాయకుడిగా మారిన ముఖ్తార్ అన్సారీ జైలులో గుండెపోటుతో మృతి చెందాడు. అన్సారీ మృతితో యూపీలో హై అలెర్ట్ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. 
 
1997 నుంచి 2022 వరకు మౌ అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. 60 ఏళ్ల అన్సారీని మరణించినట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు బాందా జైలు నుంచి రెండోసారి రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. అంతకుముందు, కడుపునొప్పి రావడంతో మంగళవారం కూడా ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు. 
 
గురువారం రాత్రి అన్సారీ గుండెపోటుతో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌లో ధ్రువీకరించాయి. కాగా, గ్యాంగ్ స్టర్ అన్సారీ మరణంపై ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ స్పందించాడు. తన తండ్రికి జైలులో ఆహారం ద్వారా స్లో పాయిజన్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై తమ కుటుంబం కోర్టును ఆశ్రయిస్తుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు