హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్

గురువారం, 5 జనవరి 2023 (08:40 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాడింగ్ చేశారు. వాతావరణం అనుకూలించక పోవడంతో ఈ విమానాన్ని గౌహతి విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు. దీంతో ఆయన ఆ రాత్రికి అక్కడే ఓ నక్షత్ర హోటల్‌లో బస చేశారు. గురువారం ఉదయం త్రిపురకు వెళ్లి అక్కడ రథయాత్రను ప్రారంభిస్తారు. 
 
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ బీజేపీ రథ యాత్రను ప్రారంభించనుంది. ఈ రథయాత్రను ప్రారంభించేందుకు అమిత్ షా బుధవారం రాత్రే అగర్తలకు చేరుకోవాల్సి వుంది. కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో గౌహతి విమానాశ్రయంలో దించేశారు. 
 
గురువారం అగర్తలకు చేరుకుని అక్కడ బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన జన బిశ్వాస్ రథ యాత్రను ప్రారంభిస్తారు. ఆ ర్వాత ధర్మనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. గురువారం మధ్యాహ్నం ఓ కార్యకర్త ఇంటిలో ఆయన భోజనం చేస్తారు. ఆ తర్వాత దక్షిణ త్రిపురలోని సబ్రూమ్‌కు బయలుదేరి వెళతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు