పార్టీ మారరని గ్యారెంటీ ఏంటి.. రూ.100 స్టాంప్ పేపర్‌లో రాసివ్వండి.. ఎమ్మెల్యేలను కోరిన కాంగ్రెస్

బుధవారం, 25 మే 2016 (12:07 IST)
కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యను కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. దీంతో వారికి ఓ ప్రశ్న సంధించింది. భవిష్యత్‌లో పార్టీ మారబోరని గ్యారెంటీ ఏంటి అంటూ ప్రశ్నించింది. అంతేనా... పార్టీ మారబోమని పేర్కొంటూ రూ.100 పేపర్ల స్టాంప్ పేపర్‌లో రాసివ్వాలని కోరింది. 
 
ఇటీవల వెల్లడైన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని 40 సీట్లకు పైగా గెలుచుకుంది. ఇపుడు ఆ ఎమ్మెల్యేలంతా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి మారిపోతారనే భయం పట్టుకుంది. దీంతో ఫిరాయింపులను తట్టుకునేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. 
 
తాము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉంటామని, రూ.100 స్టాంప్ పేపర్‌పై బాండ్ రాసి ఇవ్వాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కోరింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి