చేపలు, ఇతర మాంసాహారం, పుట్ట గొడుగులు తినడం ద్వారా, వంటికి ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తగలడం వల్ల మానవ శరీరంలో డీ విటమిన్ తయారవుతుందన్న విషయం తెల్సిందే. ప్రజల్లో డీ విటమిన్ తక్కువగా ఉన్న దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆమ్‌స్టర్‌డామ్‌లోని వ్రిజి యూనివర్శిటీ జరిపిన మరో పరిశోధనలో తేలింది.
చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విడ్జర్లాండ్ దేశాల్లో నమోదైన కరోనా కేసులను ఈ యూనివర్శిటీ పరిశోధన బందం విశ్లేషించింది. విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో 50 శాతం మందికి ఛాతీపరమైన ఇన్ఫెక్షన్లు తగ్గాయని ‘యూనివర్శిటీ ఆఫ్ గ్రెనడా’ జరిపిన పరిశోధనలో తేలింది.