కోవిడ్-19 ను ఎదుర్కొనడంలో విటమిన్-డి ప్రాముఖ్యత తెలుసా?

శనివారం, 21 నవంబరు 2020 (10:00 IST)
మన శరీరంలో విటమిన్-డి పుష్కలంగా ఉన్నట్టయితే కోవిడ్-19 వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని అనేక పరిశోధనలు వెల్లడించాయి. అయితే దేశంలో దాదాపు 80 శాతం మంది ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోని వారు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు అంటున్నారు.

విటమిన్-డికి కోవిడ్ వైరస్ తో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా.. మహమ్మారి కారణంగా మరణం ముప్పును తగ్గించడంలో మాత్రం ఇది కీలకపాత్ర పోషిస్తోందని అనేక పరిశోధనలు వెల్లడించాయి.
 
విటమిన్-డి ప్రభావం
మానవ శరీర ముఖ్య విధుల్లో విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్-డి తగినంత స్థాయిలో లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఒళ్లు నొప్పులు, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. దీంతో విటమిన్-డి లోపం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం కోవిడ్ -19తో పోరాటంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది.
 
‘సైటోకైన్‌ స్టార్మ్‌’లో ఏం జరుగుతుంది?
రోజూ విటమిన్-డి డోస్ తీసుకునే వాళ్లలో కోవిడ్ వైరస్ తో చనిపోయే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుందని  బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు.  రక్తంలో ఉండే ఇమ్యూన్ సెల్స్‌తో విటమిన్ కు లింక్ ఉంటుందని వారు గుర్తించారు.

శరీరంలో ఉండే సైటోకైన్‌ స్టార్మ్‌ ప్రభావం   ఇమ్యూన్ సిస్టమ్ (రోగనిరోధక వ్యవస్థ) పై పడుతుంది. తద్వారా  ఎక్కువ సంఖ్యలో ప్రొటీన్లు రక్తంలోకి త్వరితగతిన విడుదలై ప్రొటీన్ల లెవల్స్ ను తారుమారు చేస్తుందని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు తమ పరిశోధనలో తెలిపారు.
 
విటమిన్-డి లోపం కలిగే నష్టాలు:
విటమిన్-డి లోపం ఉన్నవారికి ఎముకల బలహీనం, తలనొప్పి, జత్తు రాలిపోవడం, కండరాల నొప్పులు తలెత్తుతాయి. ఈ స్టడీలో బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు 235 మంది పేషెంట్లు బ్లడ్ శాంపుల్స్ పరిశీలించి విటమిన్-డి ను కాలిక్యులేట్ చేశారు.

క్లినికల్ రిజల్ట్స్‌లో శ్వాస సంబంధిత సమస్యలు, స్పృహ కోల్పోవడం, చనిపోవడం వంటివాటిని గుర్తించారు. 40ఏళ్లకు పైగా వయస్సున్న వారిలో విటమిన్-డి  లెవల్స్ కనీసం 30నానోగ్రామ్స్/మిల్లీలీటర్ ఉండాలి. అంటే 51శాతం కంటే ఎక్కువగా లేకపోతే విటమిన్-డి లోపంతో చనిపోతున్నారు.
 
విటమిన్-డి ఇలా పొందవచ్చు:
* సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ద్వారా శరీరానికి డి-విటమిన్ లభిస్తుంది. ఉదయం పూట కనీసం 15 నిమిషాలు ఎండలో ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 
 
* కొవ్వు ఉన్న చేపలు, కోడి గుడ్డు, పాలు, పుట్టగొడుగులు, పన్నీర్‌, జున్ను, వెన్న వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి. 
 
* ఇంజక్షన్‌లు, మాత్రలు, సిరప్‌, పొడి రూపంలోనూ విటమిన్‌-డిని తీసుకోవచ్చు. వైద్యుల సూచనమేరకే వీటిని వాడడం మంచిది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు