మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్డౌన్ లేదు : సీఎం ఉద్ధవ్
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఇక్కడ పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అనేక రకాలైన చర్యలతో ఆంక్షలు విధిస్తోంది. ఇందులోభాగంగా, మహారాష్ట్రలో బుధవారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ సీఎం ఉద్ధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మహారాష్ట్రలో 15 రోజుల పాటు కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి.