కరోనా వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సాధించిన భారత్

ఆదివారం, 30 జనవరి 2022 (17:37 IST)
భారత్ మరో అరుదైన రికార్డు సాధించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. గత యేడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దేశంలో 75 శాతానికి పైగా జనాబాకు రెండు డోసుల వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయినట్టు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. 
 
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఒడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 75 శాతం మందికి పైగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తయినట్టు తెలిపారు. 
 
మరోవైపు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. భారత్ ఈ మైలురాయి చేరుకున్నందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. టీకాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిని చూస్తే గర్వంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు