ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం భారత్‌లో రెండు, మూడు దశల్లో ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ఇపుడే దేశ ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా ప్రభావం అంతగా లేదని, కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తించడం జరిగిందన్నారు.
అదేసమయంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజల మధ్య లోకల్ ట్రాన్స్‌మిషన్ జరిగిందన్నారు. ఈ సంక్రమణను అరికట్టాలంటే మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరూ స్వచ్చంధంగా ముందుకు రావాలని కేంద్రం విజ్ఞప్తి చేయాలని కోరారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చివరి దశల్లో ఉందనీ, ఇలాంటి వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏకైక మార్గం లాక్‌డౌన్ ఒక్కటేనని ఆయన తెలిపారు.