నిజానికి చైనాలో పుట్టి, ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్‌లో మాత్రం నామమాత్రంగా కనిపించింది. విదేశాల నుంచి వచ్చేవారిని విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ చేసి కరోనా లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తే అక్కడ నుంచి క్వారంటైన్లకు తరిలించింది. దీంతో ఆరంభంలో ఈ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కాలేదు. ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరపీల్చుకున్నాయి.
అయితే, ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లీగి జమాత్ సంస్థ ఆధ్వర్యంలో మత సమ్మేళనం జరిగింది. దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అనేక మంది ముస్లిం ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే, కరోనా బాధితుల నుంచి అనేక మంది కరోనా వైరస్ లక్షణాలతో ముస్లిం మత ప్రముఖులు కూడా వచ్చారు. వీరిద్వారా, మన దేశం నుంచి హాజరైన ముస్లిం ప్రతినిధులకు ఈ వైరస్ కోరింది. వారంతా అక్కడ నుంచి తమతమ ప్రాంతాలకు వెళ్లి ఇతరులకు అంటించారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఒక్కసారిగా వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకు వెళ్లిపోయాయి.
అయితే, కొందరు ముస్లింలు 14 రోజుల క్వారంటైన్‌కు భయపడి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకురావడం లేదు. అలాంటివారితో ప్రభుత్వాలకు పెద్ద సమస్య వచ్చిపడింది. ఎన్నిసార్లు హెచ్చరించినా బతిమాలినా కొండతమంది బయటికి రావట్లేదు. దాంతో 'మర్కజ్' కార్యక్రమానికి హాజరైన తబ్లీగి జమాత్ వర్కర్లకు హర్యానా రాష్ట్ర హోం శాఖ గట్టి హెచ్చరిక చేసింది.
బుధవారం సాయంత్రం ఐదు గంటల లోపు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి తమ వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. లేనిపక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలలో స్వచ్చందంగా ముందుకురాని జమాత్ సభ్యులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించాయి.