వివరాల్లోకి వెళితే.. వికలాంగురాలైన చిన్నారి తల్లి మాటలు రావు. అందువల్ల ఈ సంఘటన వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు చెప్పారు. ములుండ్ వెస్ట్‌లోని జెవార్ రోడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సొసైటీలోని ఒక భవనంలో 14వ అంతస్తులో ఈ వికలాంగ మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు 40 రోజుల క్రితమే ఆడపిల్ల పుట్టింది.