భారత నౌకాదళంలో చేరిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ

ఠాగూర్

మంగళవారం, 22 అక్టోబరు 2024 (13:38 IST)
అణు శక్తిని పెంపొందించుకునే విషయంలో భారత్‌ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ తీరంలో నౌకాదళం 4వ అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌)ని ఆవిష్కరించినట్లు సమాచారం. విశాఖపట్టణంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దామగుండంలో వీఎల్‌ఫ్‌ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మరుసటి రోజే ఈ కార్యక్రమం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. 
 
ఈ యేడాది ఆగస్టు నెలలో ఎస్‌ఎస్‌బీఎన్‌ అరిఘాత్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నౌకాదళానికి అందజేసి జాతికి అంకితం చేసిన విషయం తెల్సిందే. వచ్చే యేడాదికి ఈ శ్రేణిలో మూడో సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ అరిధమాన్‌ను సిద్ధం చేయనున్నట్లు నేవీ అధికారులు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో శత్రువులను ఎదుర్కోవడంలో జలాంతర్గాములు మెరుగైన పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు