ఈ కేసులో డీఎన్ఏ ఒక్కటే కావడంతో అమృత హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సీసీఎంబీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సీసీఎంబీ కోర్టు ఆదేశాల మేరకే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ కేసులో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలంటే.. అమ్మ అస్థికల డీఎన్ఏను సేకరించాలి.
కానీ ఆ పని జరిగేలా కనిపించట్లేదు. దీంతో జయలలిత తోబుట్టువుల నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. డీఎన్ఏ పరీక్ష చేసి అమృతను జయలలిత కుమార్తెనా లేదా అనేది పెద్ద విషయం కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఆ పరీక్షలపై కోర్టు ఎలాంటి తీర్మానం తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.