అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్ కోరారు. బుధవారం తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ఆయన ఈ సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1992లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆడశిశువుల హత్యల నివారణ కోసం 'తొట్టిల్ కుళందైగళ్ తిట్టం (క్రెడిల్ బేబీ స్కీమ్)'ను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అలాగే, ఇది మదర్ థెరెసా ప్రశంసలు అందుకున్న పథకమన్న డిప్యూటీ స్పీకర్ చెప్పుకొచ్చారు.