బస్సుల్లో వలస కూలీల జర్నీ.. మూడేళ్లలో ఇంటికి చేరుకుంటారు లెండి..?

శుక్రవారం, 1 మే 2020 (16:48 IST)
Abhishek Manu Singhvi
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల విషయంలో కేంద్రం సరైన గ్రౌండ్ వర్క్‌ చేయలేదని ఫైర్ అయ్యారు. వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించడానికి రైళ్లు అయితే బాగుంటుందని తాము సూచించామని, కానీ కేంద్రం బస్సులను ఏర్పాటు చేస్తోందన్నారు. 
 
బస్సుల్లో అయితే వలస కూలీలు ఇళ్లకు చేరుకోవడానికి మూడు సంవత్సరాలు పడుతుందని ఎద్దేవా చేశారు. వీరి రవాణా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం నిధులను కూడా విడుదల చేయడం లేదని, నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగిసే సమయం దగ్గరపడిందని, వలస కార్మికుల అవస్థల గురించి ప్రధాని మోదీకి ఓసారి గుర్తు చేయాలన్నారు. 
 
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కార్మీకులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కార్మికుల విషయంలో కేంద్రం ఏప్రిల్ 29 న విడుదల చేసిన మార్గదర్శకాలు నిర్హేతుకమైనవని, తుగ్లక్ చర్య అని సింఘ్వీ మండిపడ్డారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు