బస్సుల్లో అయితే వలస కూలీలు ఇళ్లకు చేరుకోవడానికి మూడు సంవత్సరాలు పడుతుందని ఎద్దేవా చేశారు. వీరి రవాణా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం నిధులను కూడా విడుదల చేయడం లేదని, నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగిసే సమయం దగ్గరపడిందని, వలస కార్మికుల అవస్థల గురించి ప్రధాని మోదీకి ఓసారి గుర్తు చేయాలన్నారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కార్మీకులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కార్మికుల విషయంలో కేంద్రం ఏప్రిల్ 29 న విడుదల చేసిన మార్గదర్శకాలు నిర్హేతుకమైనవని, తుగ్లక్ చర్య అని సింఘ్వీ మండిపడ్డారు.