ఈనేపథ్యంలో నవీ ముంబై ఎస్కార్ట్ టీమ్ జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పాటిల్‌ను యూపీలో గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. పాటిల్‌ను ప్రశ్నించగా ఎస్కార్ట్ బృందంలో కొందరు పోలీసులు తన అదృశ్యానికి సహకరించిన తీరును వెల్లడించారు. కొనుగోలు చేసేందుకు అనుమతించాలని జేజే ఆస్పత్రి వద్ద పోలీస్ అధికారిని పాటిల్ కోరగా, ఇద్దరు ఎస్కార్ట్ సిబ్బందిని పాటిల్ వెంట ఇచ్చి పంపారని తెలిపారు.
ఆ తర్వాత తమ ఒప్పందంలో భాగంగా, పాటిల్ భార్య మొనాలిని పోలీసులు నేరుగా బ్రైట్‌వే హోటల్ రూమ్‌కు తీసుకొచ్చారు. అక్కడ భర్తతో తాను కొద్దిసేపు ఏకాంతంగా గడిపేందుకు అనుమతించాలని మొనాలి కోరడంతో దాదాపు మూడు గంటల పాటు వారిని ఒకే రూమ్‌లో ఉండేందుకు కానిస్టేబుల్స్ అనుమతించారు.
ఆ తర్వాత రూమ్ డోర్‌ను ప్రెస్ చేసిన కానిస్టేబుల్‌కు రూమ్‌లో మొనాలి ఒక్కరే కనిపించడంతో ఎస్కార్ట్ బృందం షాక్‌కు గురైంది. హోటల్ రూమ్ కిటీకి నుంచి నిందితుడు పాటిల్ పరారయ్యాడు. పాటిల్ దంపతులను ఏకాంతంగా ఉండేందుకు అనుమతించడంతో పాటు మొనాలి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకున్నందుకు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.