తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5వ తేదీన అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధికి పక్కనే ఖననం చేశారు. జయలలిత మృతితో తమిళనాడు విషాదంలో మునిగిపోయింది. గత సెప్టెంబర్ 22వ తేదీ అపోలోలో చేరిన జయలలిత 75 రోజుల పాటు చికిత్స పొందుతూ.. చికిత్స ఫలించక మృతి చెందారు.