ఈ దశలో ముంబయిలో జెట్ ఎయిర్ వేస్ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) సుధీర్ గౌర్ తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకు ఆయన జెట్ ఎయిర్ వేస్ కి రాజీనామా చేశారో కారణాలను వెల్లడించ లేదు. కానీ, రాకేష్ ఝుంఝునువాలా అకాసా కొత్త విమానయాన సంస్థలు కార్యకలాపాలను ప్రారంభిస్తున్న సమయంలో ఆయన ఇందులో చేరొచ్చని ఎయిర్ లైన్స్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో రెండు సంవత్సరాల సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్ వేస్ తర్వాత 2022లో తిరిగి తన సేవలను పున:ప్రారంభిస్తోంది. ఈ సమయంలో సిఇఒ గౌర్ రాజీనామా చేయడం ఆ సంస్థకు పెద్ద నష్టమేనని భావిస్తున్నారు. అయితే, కొత్తగా మళ్లీ ప్రారంభం అవుతున్న ఆకాశ ఎయిర్ లైన్స్ వైపు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది మళ్లతారేమో అనే అనుమానాలు పరిశ్రమ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.