జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో జరిగిన అడిషనల్ న్యాయమూర్తి హత్య కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్నింగ్ జాగింగ్‌కు వెళ్లిన జడ్జీని మైనింగ్ మాఫియా ఆటోతో ఢీకొట్టించి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ మృతి తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ, సీసీ టీవీ కెమరాల నుంచి దుండగులు తప్పించుకోలేక పోయారు.
ఆటోను దొంగతనం చేశారని పేర్కొన్నారు. పట్టణంలో అనేక మాఫియా హత్యకేసులను న్యాయమూర్తి విచారిస్తున్నారు. ఇటీవల ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల బెయిల్ అభ్యర్థనలను తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన గ్యాంగ్ మాఫియా ఈ దారుణానికి పాల్పడివుంటుందని భావిస్తున్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు కూడా కేసును సుమోటాగా స్వీకరించి విచారణ జరుపుతుంది.