ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా చేసిన ట్వీట్‌కు ఝార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ స్నేహం చేస్తున్నట్లు జేఎంఎం ఆరోపించింది. ప్రధాని మోడీపై ఝార్ఖండ్ సీఎం చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్ ఖండించిన నేపథ్యంలో ఆయన ట్వీట్‌కు ఝార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటర్ ఇచ్చింది.
'వైఎస్ జగన్ జీ! మీ నిస్సహాయత గురించి దేశమంతటికీ తెలుసు. మేం మీ పట్ల ప్రేమాభిమానాలు చూపుతున్నాం. మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కాగా, జగన్ బెయిల్ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. అందుకే మోడీపై జగన్ భక్తిభావం చూపుతూ ట్వీట్ చేశారన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే.