30 వేల మంది ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి జూబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ కోవిడ్‌ టీకా కార్యక్రమం

మంగళవారం, 1 జూన్ 2021 (22:00 IST)
తమ పీపుల్‌ ఫస్ట్‌ సిద్ధాంతంతో, భారతదేశంలో అతిపెద్ద ఫుడ్‌ సర్వీస్‌ కంపెనీగా వెలుగొందుతున్న జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ లిమిటెడ్‌ (జెఎఫ్‌ఎల్‌) తమ 30వేల మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం దేశ వ్యాప్తంగా టీకా కార్యక్రమం ఆరంభించింది. ఈ కంపెనీ ఈ కార్యక్రమం కోసం సుప్రసిద్ధ ఆస్పత్రులు అయినటువంటి అపోలో, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మరియు ఇతర ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకూ 7040 ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్‌లను అందజేశారు.
 
ఈ టీకా ఖర్చును జెఎఫ్‌ఎల్‌ భరించడంతో పాటుగా జెబీఎల్‌ బ్రాండ్స్‌లో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ టీకాలను అందజేయనున్నారు. ప్రస్తుత కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ సమయంలో తమ ఉద్యోగుల కోసం జెఎఫ్‌ఎల్‌ ప్రారంభించిన ఇతర కార్యక్రమాలు ఇలా వున్నాయి.
 
1. 24గంటల హెల్ప్‌లైన్‌ ; కోవిడ్‌ సంబంధిత మద్దతు అందించడం కోసం గ్రూప్‌ లెవల్‌ టాస్క్‌ఫోర్స్‌.
 
2. కోవిడ్‌ చేత ప్రభావితమైన ఉద్యోగులు, కుటుంబసభ్యులు ఔషదాలు పొందడం కోసం సదుపాయాలు.
 
3. ముంబై, బెంగళూరు,  చెన్నై, నోయిడా మరియు ఇండోర్‌లలో ఐసోలేషన్‌ కేంద్రాలు.
 
4. ఒకవేళ ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అంకితం చేయబడిన అంబులెన్స్‌లు.
 
5. ఆస్పత్రిలో చేరేందుకు తగిన సహాయం, టీపీఏ అనుమతులు వేగంగా మంజూరు చేయడం.
 
6. సమగ్రమైన శారీరక, మానసిక ఆరోగ్యం కోసం డాక్టర్లు మరియు కౌన్సిలర్లతో కన్సల్టేషన్‌.
 
7. మృత్యువాత పడిన ఉద్యోగుల కుటుంబాలకు సహాయపడే రీతిలో సమగ్రమైన ప్యాకేజీ.
 
8. అన్ని స్టోర్‌లలోనూ పల్స్‌ ఆక్సీమీటర్‌, ఆర్‌ టీ పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లు.
 
9. రెస్టారెంట్‌ ఉద్యోగులందరికీ  వైద్య పరీక్షలు చేయించుకునేందుకు భత్యాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు