అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమిత్ షాతో పలు విషయాలపై చర్చించినట్టు చెప్పారు. ఇటీవల తనపై జరిగిన దాడి వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ భవిష్యత్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రూ. 8 లక్షల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రూ. 4.5 లక్షల కోట్లు అప్పు చేసిందమి తెలిపారు. అప్పులు ఇలాగే చేసుకుంటూ పోతే త్వరలోనే దేశం మరో శ్రీలంక అవడం ఖాయమని హెచ్చరించారు.