తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ హరిచందన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నారాయణను అరెస్టు చేసిందని లేఖలో చంద్రబాబు నాయుడు ఆరోపించారు.