మోడీ - షాలనే కాదు.. సీబీఐ - ఈడీలను కూడా మట్టికరిపించిన మమత బెనర్జీ?

బుధవారం, 5 మే 2021 (19:36 IST)
ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందుకున్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని అనేక మంది రాజకీయ నేతలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా, బీజేపీ నేతలు మినహా దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నేత ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 
 
మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో వ‌రుస‌గా మూడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకున్న‌ మ‌మ‌తాబెన‌ర్జి దేశ నాయ‌కురాలు అని అభివ‌ర్ణించారు. 
 
అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా తేడా ఉన్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జి త‌న ప్ర‌త్య‌ర్థులైన ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని, హోం మంత్రి అమిత్ షా, బీజేపీని, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను మ‌ట్టిక‌రిపించార‌ని చెప్పారు.
 
వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జి ప్ర‌ధాని ప‌ద‌వి కోసం న‌రేంద్ర‌ మోడీని ఢీకొట్టే అవ‌కాశాలు ఉన్నాయా అన్న ప్ర‌శ్న‌కు క‌మ‌ల్‌నాథ్ స్పందిస్తూ.. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ వ్యూహం ఏమిట‌నే విష‌యాన్ని యూపీఏ కూట‌మి స‌రైన స‌మ‌యంలో వెల్ల‌డిస్తుంద‌న్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు