జైరా వసీమ్‌దే తప్పని ఎందుకు అంటున్నారని అడిగింది. వేధింపులకు గురైన విషయాలు ఎందుకు ఓపెన్‌గా చెప్పేస్తున్నావని అమ్మాయిలను నియంత్రించడం సబబు కాదని కంగనా తెలిపింది. ఆడపిల్లలు వేసుకునే దుస్తులు, చేసే పనులు ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి చేయడానికి ఎలా కారణమవుతాయని అడిగింది. జైరా స్థానంలో తాను వుంటే వేధించిన వాడి కాళ్లు విరగ్గొట్టేదానిని అంటూ కంగనా మండిపడింది.
అంతటితో ఆగకుండా వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు చెప్తుంటే.. ఎవడో తోటి ప్రయాణీకుడు వికాస్ అమాయకుడని వాంగ్మూలం ఇస్తాడా? అమాయకుడైతే కాలితో అమ్మాయి వీపు భాగాన్ని నిమురుతాడా? అంటూ కంగనా ప్రశ్నించింది. వేధింపులు తాళలేక కన్నీళ్లు పెట్టుకున్న జైరా పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేసిందంటారా? అంటూ కంగనా మీడియా ముందు మండిపడింది.