తన జీవిత లక్ష్యమైన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ)ని పూర్తిచేశారు. తన జీవితంలో బస్వరాజ్ ఏనాడూ ఓటమిని అంగీకరించలేదు. కర్నాటక యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన ఆయన అదే రాష్ట్రంలోని హంపీ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. అంతకుముందు బస్వరాజ్ 'లా' కూడా చదువుకున్నారు. ప్రస్తుతం బస్వరాజ్ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు రాసే పనిలో నిమగ్నమయ్యారు.