దీనికి నిదర్శనం 2014 నుంచి 2017 మే నెల వరకు ఈ రాష్ట్రంలో 21,053 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆ రాష్ట్ర పోలీసు రికార్డులే వెల్లడించడం సంచలనం రేపింది. అదృశ్యమైన వారిలో 17,777 మంది మహిళలను వివిధ ప్రాంతాల్లో పోలీసులకు దొరికారు. 2014వ సంవత్సరంలో 5,989 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేసులు నమోదైనాయి. 2016వ సంవత్సరంలో అదృశ్యమైన మహిళల సంఖ్య 6,316కు పెరిగింది.
కిడ్నాప్‌లకు గురవుతున్న మహిళలు ఎక్కువగా వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని సాక్షాత్తూ కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలోనే అంగీకరించారు. పేద మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి వారిని తీసుకెళ్లి వ్యభిచారవృత్తిలో దించుతున్నారని తేలింది. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేసినా మహిళల అదృశ్యానికి తెరపడటం లేదు.