తొలి బ్యాచ్‌లో భాగంగా డెలివరీ అయిన ఐదు విమానాల్లో ఒకదాన్ని కాశ్మీర్‌కు చెందిన హిలాల్ నడిపారు. వైమానిక దళంలో కమాండర్‌గా ఉన్న హిలాల్, మిరేజ్ 2000, మిగ్ 21 తదితర ఫైటర్ జెట్‌లపై 3 వేలకు పైగా ఫ్లయింగ్ అవర్స్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
గాల్లోనే ఇంధనం ఫిల్
మరోవైపు, సోమవారం ఉదయం ఫ్రాన్స్ నుంచి భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఐదు విమానాలు ఫ్రాన్స్ నుంచి దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి బుధవారం భారత్‌కు చేరుకోనున్నాయి. అందుకే వీటి వెంట ఓ ఇంధన ట్యాంకర్ విమానం కూడా వచ్చింది.