జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ళ చిన్నారిని ఎనిమిది రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన కేసులో తాజాగా పోస్ట్‌మార్టం నివేదిక వెలుగుజూసింది. ఈ రిపోర్టు చదివితే కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ నివేదికను ఇండియా టుడే బయటపెట్టింది.
కాగా ఇంకా ఏయే విషయాలు గుర్తించారో మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ జమ్మూ కశ్మీర్ పోలీసులు మెడికల్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఇతర విషయాలతో పాటు బాధితురాలి నడుము కింది భాగమంతా బలమైన గాయాలున్నాయని, లైంగిక దాడి వల్లే ఇలా జరిగిందంటూ మెడికల్ బోర్డు నిర్ధారించి నివేదికను ముగించింది.
ఇదిలావుండగా, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ మరోసారి నోటికి పనిచెప్పారు. కఠువా రేప్ కేసు ద్వారా హిందువులను అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ గేమ్ ప్లాన్‌లో భాగంగానే ఈ కేసుపై రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.