నిఫా కూడా కోవిడ్ లాగానే జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్. ముఖ్యంగా గబ్బిలాల నుంచి ఈ వైరస్ జంతువులకు, ఆపై మనుషులకు సోకుతుంది. పందులు, కుక్కలకు కూడా ఈ వైరస్ సోకినప్పటికీ, మనుషులపైనే అధిక ప్రభావం ఉంటుంది.
విపరీతమైన తలపోటు, బ్రెయిన్ ఫీవర్, నిరంతర దగ్గుతో కూడిన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, కండరాల నొప్పి, వాంతులు, గొంతులో మంట, మైకం, మగతగా ఉండటం, మెదడువాపు, మూర్చ ఈ వ్యాధి లక్షణాలు
కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో 2018లో తొలిసారిగా నిఫా వెలుగుచూసింది. అప్పట్లో నెల వ్యవధిలోనే వైరస్ బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి నిఫా విస్తరిస్తుండటం.. మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది