సమాజంలోని సామాన్య మహిళలకే కాదు... ఆధ్యాత్మిక ముసుగులో లీనమైన సన్యాసి (నన్స్)నిలకు కూడా రక్షణలేకుండా పోయింది. నన్స్‌కు చర్చి ఫాదర్ల నుంచి, బిషప్‌ల నుంచే ముప్పు ఏర్పడింది. ఫలితంగా వారు అత్యాచారాలకు గురవుతున్నారు. కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో ఓ సన్యాసినిపై చర్చి బిషప్ 13 సార్లు అత్యాచారం చేశాడు. దీంతో అతనికి కేరళ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
కేరళ రాష్ట్రంలోని జలంధర్ డయాసిస్‌కు చెందిన ప్రాంకో ములక్కల్ కేథలిక్ బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని క్రైస్తవ సన్యాసిని ఇచ్చిన ఫిర్యాదు మేర కొట్టాయం డీఎస్పీ కె.సుభాస్ బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. తనపై బిషప్ అత్యాచారం చేశాడని చెప్పిన మూడురోజులు బిషప్ కాన్వెంట్‌లోనే ఉన్నట్లు అక్కడి విజిటర్స్ బుక్‌లో నమోదై ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
నన్‌పై జరిగిన అత్యాచారం గురించి మిగిలిన మరో నలుగురు క్రైస్తవ సన్యాసినులకు తెలుసని తమ దర్యాప్తులో వెల్లడైందని డీఎస్సీ సుభాష్ పేర్కొన్నారు. దీంతో నిందితుడైన బిషప్‌ను ఇంటరాగేషన్ చేసేందుకు సమన్లు జారీచేశామని డీఎస్పీ వెల్లడించారు. 2014లో అనాథ ఆశ్రమం వద్ద ఉన్న అతిథి గృహంలో బిషప్ తనపై మొదటిసారి అత్యాచారం చేశాడని నన్ పేర్కొంది. బిషప్ నిర్వాకంపై తాను చర్చ్ అథారిటీకి ఫిర్యాదు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నన్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వెల్లడించింది.