కేరళలోని త్రిశూర్‌లో కొట్టాయంకు చెందిన 22 ఏళ్ళ దళిత యువకుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు 22 ఏళ్ళ విద్యార్థిని తీవ్రంగా వేధించారు. సుమారు 5 గంటలపాటు 8 మంది సీనియర్ విద్యార్థులు జూనియర్ దుస్తులు విప్పించి నగ్నంగా నిలబెట్టి చిత్రహింసలకు గురి చేశారు. తీవ్రమైన వ్యాయామాలు చేయించారు.