కాశ్మీర్ లోయలో పవిత్ర అమర్నాథ్ యాత్ర మొదలైంది. హిమాలయాల్లో కొవులైన పవిత్ర మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు తొలి బ్యాచ్ భక్తులు అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. మూడు వేల మందితో కూడిన మొదటి బ్యాచ్ యాత్రను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం తెల్లవారుజామున జెండా ఊపి ప్రారంభించారు.
కాగా, కరోనా వైరస్ మహ్మారి కారణంగా గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్రకు కేంద్రంతో పాటు స్థానిక యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ యేడాది హిమ లింగాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని జమ్మూకాశ్మీర్ భావిస్తోంది.