దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఇటువంటి తరుణంలో వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నిత్యం వారి ప్రాణాలను ఫణంగా పెట్టి మన కోసం ముందుండి పోరాడుతున్నారు.
మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలను ప్రశంసించాలి, అంతేకానీ ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్న వారిపట్ల, వారి కుటుంబాల పట్ల వివక్ష చూపకూడదు.
అదే విధంగా వారి గురించి గానీ, కోవిడ్-19 గురించి గానీ తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదు. ఈ సంక్షోభ సమయంలో పుకార్లు మరియు తప్పుడు సమాచారం వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల్లో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి.