సీబీఐ అధికారిని చితక్కొట్టిన గ్రామస్థులు.. ఎందుకు? ఎక్కడ?

బుధవారం, 17 నవంబరు 2021 (08:58 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని ఓ సీబీఐ అధికారిపై గ్రామస్థులు దాడి చేశారు. లైంగికదాడి కేసులో నిందితుని అతని ఇంట్లో విచారిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విచారణ కొనసాగుతుండగానే గ్రామస్తులు ఆ అధికారులపై దాడిచేశారు. వారున్న ఇంటికి తాళంవేసి వారిని నిర్బంధించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామం నుంచి వారిని సురక్షితంగా తీసుకెళ్లిన ఘటన ఒడిశాలోని దేనకనాల్ జిల్లాలో జరిగింది.
 
ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న ముఠాలే లక్ష్యంగా సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 77 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒడిశాలోని దేనకనాల్ జిల్లాకు చెందిన మిథున్‌ నాయక్‌ను అతని ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లారు.
 
నిందితుడిని విచారిస్తుండగా అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సీబీఐ బృందంపై దాడికి దిగారు. వారిపై కర్రలతో దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు సీబీఐ అధికారులను అక్కడినుంచి పంపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు