మిడతలు తక్కువ ఎత్తులో ఎగురుతాయి కాబట్టి విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని డీజీసీఏ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సమయంలో విమానాల్లోని అన్ని ప్రవేశ ద్వారాల్లోకి ఇవి పెద్ద సంఖ్యలో చొచ్చుకెళ్లే ప్రమాదముందని తెలిపింది. ఫలితంగా ఎయిర్ స్పీడ్, అల్టీ మీటర్ సూచీలు సరిగా పనిచేయకపోవచ్చని తెలిపింది.