విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి.. వెనక్కి తిరిగివచ్చిన ఫ్లైట్

సోమవారం, 10 ఏప్రియల్ 2023 (15:01 IST)
ఇటీవలికాలంలో విమాన ప్రయాణాల్లో పలు అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారి కారణంగా తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే ఢిల్లీకి రివర్స్ అయింది. 
 
దీనికి కారణం... ఓ ప్రయాణికుడు రచ్చ చేయడమే. విమానం గగనతలంలో ఉండగా సదరు వ్యక్తి విమాన సిబ్బందితో గొడవడ్డాడు. ఇద్దరు సిబ్బందిపై దాడి చేశాడు. సాటి ప్రయాణికులతో పాటు ఇతర సిబ్బంది ఎంతగానో సర్దిచెప్పినప్పటికీ ఏమాత్రం వినిపించుకోకుండా దాడి చేశాడు. దీంత పైలెట్ విమానాన్ని వెనక్కితిప్పాడు. తిరిగి ఢిల్లీలోని విమానాశ్రయంలోని ల్యాండ్ చేశాడు. సదరు ప్రయాణికుడిని విమానం నుంచి దించేసి ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు