రాముడు అడవిలో మాంసం తినేవాడు - ఎన్సీపీ నేత జితేంద్ర

సెల్వి

గురువారం, 4 జనవరి 2024 (12:50 IST)
కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తితో పూజించే శ్రీరాముడిపై ఎన్సీపీ నేత జితేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాముడు మాంసాహారి అని జితేంద్ర తెలిపారు. మహారాష్ట్రలోని షిర్డీలో ఆయన మాట్లాడుతూ, "రాముడు బహుజనులకు చెందినవాడు. జంతువులను వేటాడి తినేవాడు. రాముడు ఒక మాంసాహారి. రాముడు 14 సంవత్సరాలు అడవిలో నివసించాడు, అక్కడ అతనికి అరణ్యాలలో మాంసాహారం, శాకాహారం తీసుకునేవాడు.." అంటూ జితేంద్ర వ్యాఖ్యానించారు. 
 
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన సమయంలో జితేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు జితేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత రామ్ కదమ్ తెలిపారు. రాముడు మాంసం తినేవాడని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ ఆరోపించారు. జితేంద్ర వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు