కర్ణాటకలోని చిక్క తిరుపతి ఆలయంలో ఒక మహిళ తన ప్రేమను నెరవేర్చమని కోరుతూ ఓ లవ్ లెటర్ రాసింది. అధికారులు ఆలయ హుండీలో డబ్బును లెక్కిస్తుండగా ఈ లేఖ దొరికింది. సాధారణంగా ఆలయ హుండీల్లో భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. కొంతమంది డబ్బు, బంగారం, వెండి కానుకలు కూడా సమర్పిస్తారు. అయితే, కర్ణాటకలో ఒక మహిళ ప్రేమలేఖను హుండీలో వేసింది. ఆ లేఖలో "దేవా, నన్ను, నా ప్రేమికుడిని త్వరలో కలపండి" అంటూ రాసింది. ఈ లేఖ రాసిన మహిళ చిక్క తిరుపతి ఆలయం కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతమైన లక్కూర్ హోబ్లిలో ఉంది.