యూపీ అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. కొత్త సీఎంగా ఆదిత్య బాధ్యతలు స్వీకరించాక మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తారనే విషయాన్ని పక్కనబెడితే.. మహిళలపై యూపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే యూపీలో ఆటపట్టించిన ఆకతాయిలకు ఓ యువతి సరిగ్గా బుద్ధి చెప్పింది. ఆకతాయిలు అల్లరి చేస్తున్నా.. పట్టించుకోని పోలీసులకు కూడా తద్వారా కనువిప్పు కలిగింది.
మహిళాలోకానికి ఆదర్శంగా నిలిచేలా ఉత్తరప్రదేశ్‌లోని ఓ యువతి తనను వేధించిన వారిని ఉతికి ఆరేసింది. పోలీసు లాఠీని లాక్కుని మరీ కాళిగా మారిపోయింది. ఆదివారం సాయంత్రం లక్నోలోని గౌతం పాలి పోలీస్ స్టేషన్ సమీపంలో కొందరు యువతులు నడిచి వెళ్తుండగా, బైకుల మీద వచ్చిన ఆకతాయిలు వారిని వేధించడం మొదలు పెట్టారు. పోలీసులు ఉన్నా సరే పట్టించుకోకుండా రెచ్చిపోయారు.