తోపుడుబండిపై కోడిగుడ్లు అమ్ముకునే ప్రిన్స్ సుమన్ అనే వ్యక్తికి ఆదాయపన్ను రూ.6 కోట్లు పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల మేరకు వ్యాపారం చేశారని, అందువల్ల రూ.6 కోట్ల మేరకు జీఎస్టీ చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు చూసిన ఆ వ్యాపారితో ఆయన కుటుంబ సభ్యులు నోరెళ్లబెట్టారు. ఈ నిర్వాకానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఐటీ అధికారులు విధుల్లో తాము ఎంత శ్రద్ధంగా ఉన్నామో నిరూపించారు.
ఎంపీలోని దామో జిల్లాకు చెందిన ప్రిన్స్ సుమన్ అనే వ్యక్తి కోడిగుడ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఐఠీ శాఖ నుంచి ఆయనకు నోటీసు వెళ్లింది. అందులో జీఎస్టీ బకాయిలు రూ.6 కోట్లు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. ఆ నోటీసులపై ప్రిన్స్ ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీ పేరును కూడా ముద్రించారు. 2022లో ఢిల్లీ చిరునామాతో ఈ కంపెనీ ప్రారంభించినట్టు అధికారులు నోటీసుల ద్వారా వెల్లడైంది. తోపుడుబండిమీద కోడిగుడ్లు అమ్ముకునే తాను ఓ కంపెనీకి యజమాని అవడమేంటని, రూ.కోట్లలో పన్ను చెల్లించమనడం ఏంటని వాపోయారు.
నిజంగా తనకు రూ.50 కోట్లు ఉంటే నిత్యం తిండి కోసం ఇలా రోడ్డు మీద తిప్పలు పడాల్సిన అవసరం ఏముందని బాధితుడు ప్రశ్నించాడు. అయితే, సుమన్ గుర్తింపు కార్డు, ఇతర వ్యక్తిగత గుర్తింపు పత్రాలు దుర్వినియోగం చేసి తన క్లయింట్ పేరుతో ఎవరో కంపెనీ ప్రారంభించారని సుమన్ తరపు న్యాయవాది తెలిపారు. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పండ్ల రసాలు విక్రయించే ఎండీ రహీస్ అనే చిరు వ్యాపారికి కూడా ఇలాంటి నోటీసునే ఐటీ అధికారులు పంపించారు. అందులే రూ.7.5 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలంటూ పేర్కొన్నారు. ఈ నోటీసు చూడగానే రహీస్ నోరెళ్లబెట్టారు.