నిజానికి పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయిన ఘటనపై ఇన్నిరోజులు బుకాయిస్తూ వచ్చిన ఆయన.. ఎట్టకేలకు తొలిసారి నిజం అంగీకరించారు. పోలీసుల కాల్పుల వల్లే మంద్‌సౌర్‌లో ఐదుగురు రైతులు చనిపోయారంటూ తొలిసారి ఆయన మీడియా ముఖంగా అంగీకరించారు. ‘పోలీసుల కాల్పుల వల్ల ఐదుగురు రైతులు చనిపోయారు. దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. నేను గతంలో కూడా ఇదే చెప్పాను. కొన్ని మీడియా చానెళ్లలో వచ్చింది కూడా’ అని ఆయన చెప్పుకొచ్చారు.
పోలీసుల కాల్పుల వల్లే రైతులు చనిపోయారన్న వాదనను గతంలో భూపేంద్రసింగ్ తిరస్కరించారు. రైతుల ఆందోళనలోకి సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించి.. ప్రజలు లక్ష్యంగా కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లోనే రైతులు చనిపోయారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆయన నిజాన్ని అంగీకరించారు.