రామభక్తులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రామాయణంపై నిర్వహించే ఓ క్విజ్‌లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.. అయోధ్యకు విమానంలో వెళ్లండి అని ఆ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రామాయణంపై జనరల్ నాలెడ్జ్ పోటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన వెల్లడించింది.