అండమాన్‌ పోర్ట్‌బ్లేయిర్‌లో భూప్రకంపనలు - 4.3గా నమోదు

బుధవారం, 29 డిశెంబరు 2021 (07:14 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. స్థానిక పోర్ట్‌బ్లేయిర్‌లో బుధవారం ఉదయం 5.30 గంటలకు ఈ భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రాని పోర్ట్‌బ్లేయిర్‌కు 165 కిలోమీటర్ల దూరం అడుగు భాగంలో గుర్తించారు. 
 
అయితే, ఈ భూకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. ఇదిలావుంటే, మంగళవారం శ్రీనగర్‌లో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెల్సిందే. అలాగే, ఈ నెల 26 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు