'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

సెల్వి

శనివారం, 23 నవంబరు 2024 (15:38 IST)
Maharastra
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'మహాయుతి' కూటమి మళ్లీ అధికారం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ఘనవిజయానికి కృషి చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్‌ పవార్‌లకు ఫోనులో ఆయన అభినందనలు తెలిపారు. 
 
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా... మహాయుతి కూటమి 222 స్థానాల్లో ముందంజలో ఉంది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలిన స్థానాల్లో ఇతరుల ఆధిక్యం కొనసాగుతోంది. 
 
మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మహారాష్ట్రలో చారిత్రక విజయం సాధించిన మహాయుతి కూటమికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు