పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, జవాన్ల వీర మరణంతో ప్రధాని మోడీ రాజకీయాలు చేస్తున్నారని, తానొక్కడినే దేశభక్తుడినని, మిగతావారు దేశద్రోహులని చిత్రీకరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు.
జవాన్ల మృతదేహాలతో రాజకీయాలు చేయడం సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ ఉనికికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రజలకు సూచించారు.
గత ఐదేళ్ళ కాలంలో మీరు (మోడీ) చేసింది ఏమీ లేదు. పైగా మన జవాన్ల వీరమరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మేం మోడీ ప్రభుత్వం వెనుక లేము. దేశానికి రక్షణ కల్పిస్తున్న మన సైనికుల వెంట ఉన్నాం అని అన్నారు. బాలాకోట్ ఉగ్రదాడుల వివరాలు బయటపెట్టమని తాము ప్రభుత్వాన్ని నిలదీస్తే మాపై పాకిస్థాన్ ముద్ర వేస్తున్నారని, ఆయన (మోడీ) తాను మాత్రమే భారతీయుడినని అనుకుంటున్నారని విమర్శించారు.